మత్య్సకారులు ,యాదవులకు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు

సమాజంలోని అన్ని వర్గాలకు సర్కారు అండ

మత్య్సకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ

సబ్సిడీ కింద మత్స్యకారులకు వాహనాలు

గొల్ల, కురుమలకు సబ్సిడీ గొర్రె పిల్లలు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి బ్యూరో అక్టోబర్06 (జనంసాక్షి)

సమాజంలోని అన్ని వర్గాలకు సర్కారు అండగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం
కొత్తకోట రహదారిలో 2 కోట్ల రూపాయలతో మత్స్యకారుల భవన్ , గోపాల్ పేట రహదారిలో రూ.2 కోట్లతో యాదవ భవన్ నిర్మాణానికి భూమిపూజ మహిళలకు బతుకమ్మ చీరలను అందజేసి, హరిజన వాడ పాఠశాలలో డాక్టర్ మురళీధర్ , శారద దంపతులు ఏర్పాటు చేసిన ఫిల్టర్ వాటర్ ప్లాంటును ప్రారంభించి మంత్రి మాట్లాడుతూ
సమాజంలోని పేద, మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నది కేసీఅర్ అభిలాష ని
మత్య్సకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ
సబ్సిడీ కింద మత్స్యకారులకు వాహనాలు
గొల్ల, కురుమలకు సబ్సిడీ గొర్రె పిల్లలు
పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ఆసరా ఫించన్లలో ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు.
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఅర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మవడి పథకాలతో ఆడబిడ్డలకు అండగా
దళితబంధు, బీసీ బంధు, మైనారిటీ బంధులతో జీవితంలో నిలదొక్కుకునేందుకు సాయం చేస్తున్నామని
రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు, సాగునీళ్లతో వ్యవసాయం బలోపేతం చేశామని చెప్పారు.
మత్స్య కారుల భవన్, యాదవ భవన్ లను అద్భుతంగా నిర్మించాలని తెలియచేసారు.అనంతరం గోపాల్ పేట మండలం జయ్యన్న తిరుమలపూర్ గోపాల్, అమరెందర్ రెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి ఎంపీపీ సంధ్య తిరుపతయ్య ఆధ్వర్యంలో 50 మంది
కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన 50 మంది కి పార్టీ
కండువాలు కప్పిబి అర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంధాలయ చైర్మన్ లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, కౌన్సిలర్ లు లక్ష్మి నారాయణ, నందిమల్ల భువనేశ్వరి, మహేష్, నాయకులు శ్యామ్, సుబ్బు, బీరయ్య తదితరులు పాల్గొన్నారు.