మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

రేగొండ ఎంపీపీ పున్నం లక్ష్మి రవి
రేగొండ (జనం సాక్షి) : మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి అన్నారు. మంగళవారం ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని వెంకటాద్రి కుంటలో చాప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎంపీపీ పున్నం లక్ష్మీ మాట్లాడుతూ మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెడుతుందని, వాటి ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అబివృద్ధి చెందాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి అవినాష్, ఎంపీడీవో సురేందర్, స్థానిక సర్పంచ్ ఏడు నూతల నిశీధర్ రెడ్డి, ఎంపీటీసీ మైస సుమలత బిక్షపతి, ఉప సర్పంచ్ గండి తిరుపతి గౌడ్, మత్స్యకారులు రమేష్, భద్రయ్య, రాజు, పాని,శివ తది తరులు పాల్గొన్నారు.