మద్దిరాల తండాలో వైద్య శిబిరం

81 మందికి వైద్య పరీక్షలు
— సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన

టేకులపల్లి, అక్టోబర్ 7( జనం సాక్షి): టేకులపల్లి మండలంలోని బద్దుతండ ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలో గల మద్దిరాల తండా గ్రామంలో శుక్రవారం సాయంత్రం నుండి రాత్రి 7 గంటల వరకు సులానగర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. మద్దిరాల తండా లో సీజనల్ వ్యాధులతో జలుబు జ్వరాలు ప్రతి ఇంట్లో ఉండడంతో స్థానిక సర్పంచ్ సులానగర్ పిహెచ్సి వైద్య సిబ్బందికి తెలియపరచడంతో వెంటనే ఆ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు . ఈ వైద్య శిబిరంలో 81 మంది కి వైద్య పరీక్షలు నిర్వహించి తగు చికిత్సను అందించారు. జ్వరంతో బాధపడుతున్న 9 మందికి రక్త పరీక్షలు చేసి నమూనాలను సేకరించారు. ఒకవైపు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వైద్య సిబ్బంది కొంతమంది గ్రామంలో ఇంటింటికి పర్యటిస్తూ నీటి నిల్వలను తొలగిస్తూ అపరిశుభ్రత పై గ్రామస్తులకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు . ఈ సీజన్లో వచ్చే వ్యాధులు పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు . ఎట్టి పరిస్థితుల్లో అపరిశుభ్రమైన ఆహారం వీధుల్లోని ఆహారం తీసుకోవద్దని, ఆహారం తీసుకునే ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత అత్యంత పరిశుభ్రంగా చేతులు కడుక్కోవాలని, ఈ సీజన్లో వచ్చే వ్యాధులు కీటక జనిత వ్యాధులపై వారికి అర్థమయ్యే రీతిలో వివరించారు . నిల్వ ఉన్న నీటిని తొలగించుకోవాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా దోమలు, ఈగల ద్వారా వచ్చే వ్యాధులు ముఖ్యంగా చికెన్ గున్యా, డెంగ్యూ రాకుండా కాపాడుకోవచ్చు అని, ముఖ్యంగా ఈ వర్షాకాలం సీజన్ లో 20 నిమిషాలు మరగబెట్టి చల్లార్చిన నీటిని తాగటంతో రక్షితమైన తద్వారా నీటి ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా కాపాడు�