మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలి…
ఏఐసిటియు,ఏఐకేఎఫ్ నాయకులు
కేసముద్రం సెప్టెంబర్ 20 జనం సాక్షి / మంగళవారం రోజున కేసముద్రం మండలం కల్వల,అమీనాపురం గ్రామాల్లో అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం( ఏఐసిటియు), అఖిలభారత రైతు సమాఖ్య( ఏఐకేఎఫ్) నాయకులు వివిధ పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో ఏఐసిటియు జిల్లా అధ్యక్షులు కంచ వెంకన్న మాట్లాడుతూ…. ఆయా గ్రామాలలో వంట షెడ్లు లేక,వంట చెరుకు దొరకక నెల నెల రావలసిన బిల్లులు రాక తదితర సమస్యలపై చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మధ్యాహ్న భోజన కార్మికులు తెలియజేయడం జరిగిందని, కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి పాఠశాలలో వంట షెడ్లు,ఉచిత గ్యాస్ కనెక్షన్లు ,పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా బిల్లులు పెంచాలని,కోడిగుడ్లకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వాలని,వంట సహాయకులకు వేతనం వెయ్యి రూపాయల నుండి 3000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.లేనిచో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను సమీకరించి వారి డిమాండ్ సాధన కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.దీనికి జిల్లాలోని మధ్యాహ్నం భోజన కార్మికులు సంసిద్ధం కావాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు జాటోత్ బిచ్చ నాయక్,మధ్యాహ్న భోజన కార్మికులు కుదురుపాక మణెమ్మ, కుంట లలిత, ఆరేపల్లి అయిలమ్మ ,గణపారపు మంజుల, గాడి పల్లి ప్రమీల,ఓరుగంటి అరుణ,ఓరుగంటి జయమ్మ,పాయిరాల నీలమ్మ,ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.
Attachments area