మన ఊరు-మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం
చందంపేట (జనం సాక్షి) సెప్టెంబర్ 15
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టింది ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య కెసిఆర్ పాలనలో ప్రభుత్వ బడులలో విప్లవాత్మక మార్పులు
గ్రామాల్లో పేద మధ్య తరగతి వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి అందిస్తుంది దేవరకొండ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ పోలేపల్లి గ్రామంలోని పాఠశాలలో రూ.42.11లక్షలతో చేపడుతున్న మన ఊరు-మన బడి కార్యక్రమానికి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకవర్గాల నిర్లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలు పోయాయన్నారు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగ రక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి పేద మధ్య తరగతి వర్గాల పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుందన్నారు అని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి పథకం తో ఈ ఏడాది నుండి ఇంగ్లీష్ మీడియాం విద్యతో పాటు మౌలిక సదుపాయాలు అదనపు తరగతి గదులు మంచినీటి సౌకర్యం విద్యుత్తు మూత్రశాలలు, మరుగుదొడ్లు, కిచేన్ షెడ్లు డైనింగ్ ప్రహరీ గోడలు డిజిటల్ క్లాస్ రూమ్స్ ల ఏర్పాటుకోసం లక్షల బడ్జెట్ను పాఠశాల విద్యా కమిటీ ఖాతాల్లో జమ చేసింది అన్నారు.గ్రామస్తులు పాఠశాల అభివృద్ధి లో భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య తో పాటు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం వారానికి మూడు కోడి గుడ్లు ఉచితంగా పుస్తకాలు దుస్తులు అందజేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నున్సవత్ పార్వతిచందు నాయక్, రైతు బంధు అధ్యక్షులు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్,సిరందాసు కృష్ణయ్య,స్థానిక సర్పంచ్ నగిళ్ళ జంగమ్మ,జడ్పీటీసీ సలహాదారుడు రమావత్ మోహన్ కృష్ణ అనంతగిరి కృష్ణ శంకర్ నాయక్ నగిళ్ళ మహేష్ ఎంఈవో సౌమ్య నాయక్ ఎంపీటీసీ మంజుల ఉప సర్పంచ్ రమేష్ సర్పంచ్ పెద్దులు మాజీ ఎంపీటీసీ కుమాార్ రవి గన్నెబొయిన మల్లేష్,సాయిలు శోభన్ వెంకటయ్య,బుచ్చయ్య రాఘవేంద్ర బాధ్య శారదాదాస్రురు పల్లా వెంకట్ రెడ్డి నారాయణ రెడ్డి సైదులు శివ దినేష్ నర్సింహా రాజేష్త దితరులు పాల్గొన్నారు