మన ఊరు మన బడి పాఠశాల పనులను పరిశీలించిన
– పంచాయతీ రాజ్ శాఖ ఏఈ మహమ్మద్ స్ఫడేర్ అలీ
పాఠశాల భవనం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
డోర్నకల్ ప్రతినిది సెప్టెంబర్-13
(జనం సాక్షి న్యూస్)
మన ఊరు-మన బడి పాఠశాల పనులు వేగవంతం చేయాలని ఏఈ మహమ్మద్ సాఫ్దిర్ అలీ అన్నారు.మంగళవారం డోర్నకల్ మండలంలోని హున్యతండా గ్రామంలోని నూతన భవనం నిర్మిస్తున్న ప్రాథమిక పాఠశాలను ఆయన పరిశీలించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రైవేటు,కార్పొరేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేసేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని హున్యతండా పాఠశాల నూతన భవనం,టాయిలెట్లు, కిచెన్ షెడ్ పనులను పరిశీలించి, నాణ్యమైన భవనాన్ని నిర్మించాలని స్థానిక ఎంపీటీసీ,కాంట్రాక్టర్ భూక్య శ్రీనివాస్ ను ఆయన సూచించారు. విద్యార్థులకు అనుకూలంగా ఉపయోగపడే విధంగా నిర్మాణాలు చేపట్టాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ మోహన్, పాఠశాలల ప్రధానోపాధ్యాడు రమేష్,బావుసింగ్ ఉన్నారు.