మరిపెడ ఎస్‌ఐ జులుంపై మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య
వరంగల్, జిల్లాలోని మరిపెడలో ఎస్‌ఐ జులుం ప్రదర్శించాడు. తన వాహనానికి అడ్డు వచ్చాడంటూ మరిపెడ ఎస్‌ఐ ఓ యువకుడిపై దాడి చేశారు. దీంతో మనస్థాపం చెందిన యువకుడు టవర్‌పైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మరిపెడలో సంచలనం సృష్టించింది.