మరో ఆణిముత్యాన్ని కోల్పోయిన తెలంగాణ

మిమిక్రీ వేణుమాధవ్‌ కన్నుమూత

అనారోగ్యంతో వేణమాధవ్‌ మృతి

ప్రముఖుల సంతాపం

వరంగల్‌,జూన్‌19(జ‌నం సాక్షి): మిమిక్రీ లోకం మూగబోయింది. మిమిక్రీకి కళగా గుర్తింపు తెచ్చినప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్‌ కన్నుమూశారు. తెలంగాణ మరో ఆణియుత్యాన్ని కోల్పోయింది. వరుసగా ఇటీవలే తెలంగాణ ఆణిముత్యాలు ఆదిరాజు వెంకటేశ్వర రావు, కేశవరావు జాదవ్‌లు కన్ను మూసిన వారంలోపే నేరెళ్ల వేణుమాధవ్‌ కూడా ఈ లోకం విడిచారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వేణుమాధవ్‌ ఇక లేరన్న వార్త తెలుసుకున్న ఆయన సన్నిహితులు, అభిమానులు, మిమిక్రీ కళాకారులు తీవ్ర దిగ్భాం/-రతికి గురయ్యారు. వేణుమాధవ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రముఖులు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. డిసెంబర్‌ 28, 1932న వరంగల్‌ జిల్లాలోని మ్టటెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మీ దంపతులకు వేణుమాధవ్‌ జన్మించారు. 1947లో పదహారేళ్ల వయసులోనే మిమిక్రీ కళారంగంలో వేణుమాధవ్‌ ప్రవేశించారు. ఆ తర్వాత దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, ఉర్దూ, తమిళంలో అనేక ప్రదర్శనలు ఇచ్చి అందరి మన్ననలు పొందారు. 2001లో నేరెళ్ల వేణుమాధవ్‌ పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1981లో శ్రీ రాజ – లక్ష్మీ ఫౌండేషన్‌ అవార్డు వరించింది. ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీతో పాటు ఇగ్నో గౌరవ డాక్టరేట్‌ తో వేణుమాధవ్‌ను సత్కరించింది. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌,తెలంగాణ రికార్డుల పుస్తకం ఆధ్వర్యంలో నేరెళ్లను జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ వేడుక ఆయన 83వ పుట్టిన రోజు సందర్భంగా హన్మకొండలో ఘనంగా జరిపారు. వేణుమాధవ్‌ పుట్టిన రోజు డిసెంబర్‌ 28న ప్రపంచ మిమిక్రీ కళాకారుల దినోత్సవంగా ఆయన శిష్యులు జరుపుకుంటున్నారు. 1971లో పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేణుమాధవ్‌.. ఎమ్మెల్సీగా సేవలందించారు. నేరెళ్ల పేరు విూద పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేశారు.

1972ా78 కాలంలో నేరెళ్ల వేణుమాధవ్‌ ఎం.ఎల్‌.సీ గా పనిచేశారు. 1976ా77 కాలంలో ఎఫ్‌.డీ.సీ డైరెక్టర్‌గా పనిచేశారు. 1974ా78 కాలంలో సంగీత నాటక అకాడవిూ సభ్యుడుగా,సౌత్‌ జోన్‌ కల్చరల్‌ కమిటీ, తంజావూరు సభ్యుడుగా, 1993ా94 కాలంలో దూరదర్శన్‌ ప్రోగ్రాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడుగా,

1993ా96లోటెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు,రైల్వే జోనల్‌ యూజర్స్‌ కమిటీ సభ్యుడు (1993ా96)గా,

ఎ.పి.లెజిస్లేటివ్‌ లైబ్రరీ కమిటీ సభ్యుడు (1972ా75)గా,రవీంద్రభారతి కమిటీ సభ్యుడు (1974ా78)గా,

ప్రభుత్వ అకాడమిక్‌ రివ్యూ కమిటీ సభ్యుడు (1975ా76)గా అనేక పదవులను నిర్వహించారు. సినిమాలంటే ఆసక్తి చూపే వేణుమాధవ్‌.. సి.నాగయ్య, గుమ్మడి వెంకటేశ్వర్రావు. అక్కినేని నాగేశ్వరరావు తదితర ప్రముఖులతో సన్నిహితంగా ఉండేవారు. భారత మాజీ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్‌, వి.వి.గిరి, జైల్‌ సింగ్‌, ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌, నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఎందరో ప్రముఖులు ఆయన ప్రదర్శనలు వీక్షించారు. ప్రసిద్ధులైన వ్యక్తులను, నాయకులను అనుకరించడంలో వేణుమాధవ్‌ దిట్ట. 2001లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. 1978లో ఆంధ్రా యూనివర్శిటీ ఆయనకు ‘కళాప్రపూర్ణ’ బిరుదు ఇచ్చింది. ఏయూ, కేయూ, ఇగ్నో నుంచి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు.

ఐక్యరాజ్యసమితిలో మిమిక్రీ ప్రదర్శించిన వేణుమాధవ్‌

మిమిక్రీ కళకు ఆద్యుడిగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలిచ్చిన వేణుమాధవ్‌ దేశమంతటికీ సుపరిచితుడు. ఐక్యరాజ్యసమితిలో మిమిక్రీ ప్రదర్శించిన మొట్టమొదటి కళాకారుడిగా వేణుమాధవ్‌ చరిత్రలో నిలిచిపోయారు. వేలాది మందిని మిమిక్రీ కళాకారులుగా తయారుచేసిన వేణుమాధవ్‌, ‘భారత మిమిక్రీ పిత’ గా పేరొందారు. ముఖ్యంగా దేశ నాయకులు, ప్రపంచ నాయకుల గళాన్ని అనుకరించడంలో దిట్ట. తన గొంతును యధాతథంగా అనుకరించడంతో నాటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ ఎంతో ముగ్ధులై, నేరెళ్లను ఆలింగనం చేసుకున్నారు. పురుషులై ఉండి కూడా దివంగత ప్రధాని ఇందిరాగాంధి గళాన్ని అద్భుతంగా మిమిక్‌ చేసారు.నేటికీ ఆయన జన్మదినమైన డిసెంబర్‌ 28ని ‘ప్రపంచ మిమిక్రీ దినోత్సవం’ గా తన శిష్యులు ఘనంగా జరుపుకుంటారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేరెళ్ల వేణుమాధవ్‌ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే.

సిఎం కెసిఆర్‌ సహా ప్రముఖుల సంతాపం

వేణుమాధవ్‌ మృతిపై పసలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ధ్వని అనుకరణ సామ్రాట్‌ నేరెళ్ల వేణుమాధవ్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్‌ నేరెళ్ల వేణుమాధవ్‌ మృతి మిమిక్రీ కళారంగానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. వేణుమాధవ్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన మిమిక్రీ కళకు పితామహుడిగా పేరొందారు. మిమిక్రీ కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిన వ్యక్తి నేరెళ్ల అని కొనియాడారు. మిమిక్రీ కళను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా నేరెళ్ల మలిచారు అని సీఎం పేర్కొన్నారు. నేరెళ్ల వేణుమాధవ్‌ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్‌ ఎస్‌కే జోషికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.సిఎం కెసిఆర్‌తో పాటు మంత్రులు, స్పీకర్‌ మధుసూధనాచారి, మండలి ఛైర్మన్‌ స్‌ వామిగౌడ్‌ తదితరులు సంతాపం ప్రకటించారు. తెలుగు వర్సిటి విసి ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ, మాజీ విసిలు డాక్టర్‌ ఎన్‌.గోపి, డాక్టర్‌ ఎల్లూరి శివారెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.