మరో ఏడుగురిని పట్టుకున్న గార్డులు
కాశిబుగ్గ, జనంసాక్షి: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లోని మిర్చి యార్డులో చిల్లర దొంగతనాల దందా కొనసాగుతూనే ఉంది. అటు చిల్లర కూలీలు, ఇటు హమాలీ, దడువాయి, గుమస్తాలు ఇష్టమొచ్చిన రీతిలో రైతుల వద్ద నుంచి మిర్చిని లాగేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. యార్డులో మిర్చిని దొంగలిస్తున్న 30 మంచి చిల్లర దొంగలను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
కాగా కరీంనగర్ జిల్లాకు చెందిన మేడిది చంద్రయ్య లక్ష్మీ అండ్ కో అడ్తికి దీపిక రంకం మిర్చి 41 బస్తాలు తీసుకురాగా.. హమాలీ, దడువాయి, గుమస్తాలు సుమారు 50 కిలోల మిర్చి మాయం చేశారు. ఈ విషయన్ని రైతు కార్మదర్శి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్వయంగా తూకాలు వేయించి రైతుకు 50 కిలోల మిర్చి అప్పగించాడు. అంతేకాకుండా మరో సారి ఇలాంటి ఘటనకు పాల్పడితే లెసైన్సు రద్దు చేస్తానని బాధ్యులను మందలించారు.