మరో నాలుగు గంటల పాటు ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరీడు నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రిపుంజయ్‌రెడ్డికి సూరికి మధ్య ఉన్న సంబంధాలు, అతనికి బీనామీగా వ్యవహరించాడా అనే అంశాలపై విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్సీ నర్సింహారెడ్డి తెలియజేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 8 బృందాలు రిపుంజయ్‌రెడ్డి బంధువులు, కుటుంబ సభ్యులు ఇళ్లపై నగరంతో పాటు కడపలో కూడా దాడులు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సూరీడు నివాసంలో ఆస్తులకు సంబంధించిన కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు నర్సింహారెడ్డి విరించారు. మరో నాలుగు గంటల పాటు దాడులు కొనసాగుతాయని ఆయన తెలియజేశారు.

తాజావార్తలు