మరో 20 ఏళ్లు రాష్ట్రంలో మనదే అధికారం
తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తిరుగు లేదు
దళితబందుపై ఊరూరా ప్రచారం చేయాలి
విపక్షాల చిల్లరమల్లర విమర్శలకు దీటుగా జవాబివ్వాలి
టీవీ చర్చల్లో పాజిటివ్‌గా సమాధానం ఇవ్వాలి
2న ఢల్లీిలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన
నవంబర్‌లో ద్విశతాబ్ది ఉత్సవాల ప్లీనరీ నిర్వహణ
టిఆర్‌ఎస్ రాష్ట్ర కమటీ సమావేశంలో సిఎం కెసిఆర్
వివరాలు విూడియాకు వెల్లడిరచిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్,అగస్టు24(జనంసాక్షి): మరో 20 ఏళ్లు తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుందని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. టిఆర్‌ఎస్‌కు ఢోకా లేదని అన్నారు. ప్రజల్లో టిఆర్‌ఎస్ అభిమానం సంపాదించుకుని సాగుతోందన్నారు. ఇదే సందర్భంలో టిఆర్‌ఎస్‌పై ఇతర పార్టీలు చేస్తున్న చిల్లరమల్లర విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణుకలు దిశానిరద్దేశం చేశారు. దళితబందును ఊరూరా బలంగా చాటాలన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం నగరంలోని తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చర్చించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి శాఖల పునర్నిర్మాణం వరకు సమావేశంలో చర్చించారు. అదేవిధంగా దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ చేయాల్సిన కృషిపై సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నవంబర్ మొదటివారంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. దళిత బంధుపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. దళితబంధును ఉద్యమంలా చేయాలన్నారు. ప్రతిపక్షాల తప్పుడు విమర్శల్ని తిప్పికొట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. వచ్చే నెల 2వ తేదీన ఢల్లీిలో తెలంగాణ భవన్‌కు శంకుస్థాపన చేసుకోబోతున్నట్లు తెలిపారు. దశలవారీగా సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. త్వరలోనే కొత్త జిల్లా అధ్యక్షులను నియమిస్తామని సీఎం పేర్కొన్నారు. వివిధ అంవాలపై మనవాదనలను గట్టిగా వినిపించాలని, టీవీ ఛానల్ డిబేట్లలో ప్రతిపక్షాల తప్పుడు విమర్శల్ని తిప్పికొట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. దళితబంధుపై ప్రజలను చైతన్యం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. దళితబంధును ఉద్యమం లాగా చేయాలని సూచించారు. బీసీబంధుతో సహా అన్ని ఇస్తామన్నారు. దశల వారీగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని తెలిపారు. దేశ రాజధానిలో కేటాయించిన స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులకు సెప్టెంబర్ 2వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. కొన్ని గంటల పాటు సాగిన సమావేశం అనంతరం కేటీఆర్ విూడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించినట్లు కేటీఆర్ తెలిపారు. ’క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే జిల్లాల్లో పార్టీల కార్యాలయాల ప్రారంభోత్సవం అక్టోబర్‌లో చేసే అవకాశాలు ఉన్నాయి. ద్విదశాబ్ది ఉత్సవాలు ఘనంగా చేస్తాం. నవంబర్ మొదటివారంలో టీఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహణకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నెలాఖరులోపు సభ్యత్వం పూర్తి చేయాలి. సెప్టెంబర్ మొదటివారంలో గ్రామ కమిటీలు
పూర్తి చేయాలి. సెప్టెంబర్ రెండోవారంలో మండల కమిటీలు, సెప్టెంబర్ మూడో వారంలో జిల్లా కమిటీలు పూర్తికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. 20 ఏళ్లుగా విజయవంతవంగా రెండు దశాబ్దాలు పార్టీని నడిపడంతో త్వరలోనే ద్విదశాబ్ది ఉత్సవాలు నిర్వహణకు రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. హైదరాబాద్, వరంగల్ మినహా జిల్లాలోని పార్టీ కార్యాలయాలు దసరా తర్వాత అక్టోబర్‌లో ప్రారంభం కావాలన్నారు.
ఢల్లీిలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనుల శంకుస్థాపన సీఎం కేసీఆర్ చేయనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన 12,769 పార్టీ పంచాయతీ కమిటీల ప్రకటన. మండల, మున్సిపల్, జిల్లా కమిటీలు కూడా సెప్టెంబర్‌లో ఏర్పాటు చేస్తారు. సంస్థాగత నిర్మాణం మొత్తం సెప్టెంబర్‌లో పూర్తి చేయాలని తీర్మానం చేశారు. కే కేశవరావు నేతృత్వంలో ఈ కమిటీలపై సంస్థాగత నిర్మాణం చేపడతారు. ప్లీనరీ సమావేశం కరోనా పరిస్థితులు చూసుకొని నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించాలని యోచనలో ఉన్నారు.