మహబూబాబాద్‌లో కొనసాగుతున్న బంద్
వరంగల్, సెప్టెంబర్ 9 : మహబూబాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ అఖిలపక్షం పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపార సంస్థలు, హోటళ్లు, మూతపడ్డాయి. ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా సీపీఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. మరోవైపు మహబూబాబాద్‌లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.