మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలతో ఘనంగా నివాళులర్పించిన జిల్లా పోలీసు అధికారులు.
గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 2 జనం సాక్షి.
జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు జాతిపిత మహాత్మా గాంధీ 154 వ జయంతి ని, స్వతంత్ర సమర యోధుడు భారత దేశ రెండవ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి 119వ జయంతి లను పురస్కరించుకొని జిల్లా అదనపు ఎస్పీ ఎన్. రవి వారి చిత్ర పటాలకు పూలమాల తో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ జాతీపిత మహాత్మాగాంధీ తన సిద్ధాంతాలైన సత్యం ,అహింస తో దేనినైనా సాధించవచ్చు అని నమ్మిన వ్యక్తి అని,సత్యాన్ని, అహింస ను పాటించడం లో ప్రపంచ మానవాళికి ఆదర్శoగా నిలిచారని అన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటం లో అతి వాదులను, మిత వాదులను ఏకతాటిపైకి తీసుకువచ్చి భారత స్వాతంత్ర్య పోరాటం లో విజయం సాధించారని , సమాజం లో జరిగే రుగ్మతలకు వెంటనే స్పందించేవారని, తను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసే వారని అన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమం, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం లాంటి ఉద్యమాలను అహింస మార్గం లో నడిపించారని అన్నారు.
లాల్ బహుదూర్ శాస్త్రి గురించి మాట్లాడుతూ జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదానిచ్చి దేశానికి సైనికుల, రైతుల గొప్పదనాన్ని తెలియజేసిన వ్యక్తి అని, భారత రెండవ ప్రధానిగా చక్కటి పారదర్శకమైన పాలన అందించారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శివ కుమార్, అర్.ఐ వెంకట్, అర్ .ఎస్సై చంద్ర కాంత్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.