మహిళబంధు ముఖ్యమంత్రి కేసీఆర్ .

వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు.
తాండూరు అగస్టు 12(జనంసాక్షి)స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు కార్యక్రమంలో భాగంగా తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం తాండూరు పట్టణంలోని 9వ వార్డ్ సాయిపూర్ అంగన్వాడీ కేంద్రంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు రాఖీ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు.అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో కలసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టడం జరిగింది.ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మహిళ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నవీణా,ఆర్పీలు సైరభాను,హారిక, వి.ఆర్.ఓ స్వప్న,వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.