మహిళలకు మోబైల్ అక్కర్‌లేదు:బీఎస్పీ ఎంపీ
ముజఫర్‌నగర్: మహిళలు మోబైల్ ఫోన్ వినియోగించటంపై బీఎస్పీనేత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు, చిన్నారులకు మోబైల్ ఫోన్లు అవసరం లేదని బీఎస్సీ ఎంపీ రాజ్‌పాల్ సౌనీ అన్నారు. మహిళలు, చిన్నారులకు సెల్‌ఫోన్ ఇవ్వాల్సిన అవసరంలేదని వాటి వినియోగంతో చెడుమార్గం పట్టే అవకాశముందని ఉత్తరప్రదేశ్‌లోని ముజఫఱ్‌నగర్‌లో జరిగిన సమావేశంలో సౌనీ వెల్లడించారు. తన తల్లీ, భార్య సోదరి మోబైల్ ఫోన్లు ఎప్పుడు వినియోగించలేదని అవి లేకుండా కూడా వారు సంతోషంగా ఉన్నారని తెలిపారు.