మహిళల్లో భద్రత భావాన్ని పెంచాలి

న్యూఢిల్లీ: దేశంలో అన్నివేళలా తమకు రక్షణ, భద్రత ఉన్నాయని మహిళలు భావించే పరిస్థితులు తీసుకురావాలని రాష్రటపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వివిధ పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థల చిన్నారులు గురువారం రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ చేతికి రాఖీలు కట్టి ఆయన ఆశీస్సులు అంరుకున్నారు. రంగురంగుల దుస్తులు, పాఠశాల యూనిపాంటు ధరించిన వారితో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ప్రణబ్‌ మాట్లాడుతూ మహిళల రక్షణ, అభ్యున్నతికి రెట్టింపు కృషి చేయాలని పౌరులకు సూచించారు. రాఖీ అనేది ఒక సంద్రాయం మాత్రమే కాదని. సోదరుల చేతికి సోదరి కట్టే రాఖీ అనుబంధాలకు ప్రతీకని అభివర్ణించారు.