మహిళల పట్ల జరిగే దారుణాలపై మార్పు రావాలన్న ప్రధాని

ఢిల్లీ: దేశంలో మహిళల భద్రత ఇప్పటికీ సమస్యగానే ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఆలోచనాధోరణిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. సమాజంలో మహిళలపట్ల దారుణాలపై అందరూ కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకున్నామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెలిపారు.