మహిళా దినోత్సవం సందర్భంగా మండల మహిళా శక్తికి ఘన సన్మానం
ముప్కాల్ (జనం సాక్షి) మార్చ్ మండల పరిధిలో గ్రామాల మహిళా సర్పంచ్ లకు ఎంపీటీసీలకు అంగన్వాడి ఆశ, పారిశుద్ధ్య రంగాలలో పనిచేస్తున్న మహిళలకు అలాగే ఎంపీపీ జడ్పిటిసి లకు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల బి ఆర్ ఎస్ అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలందరినీ ఘనంగా సన్మానించి చీరలను బహుకరించారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మహిళా శక్తికి మించిన శక్తి ఏది లేదని వారిని గౌరవించుకోవడం మనకు ఎంతో గర్వకారణమని మహిళలను కొనయాడారు ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి నర్సారెడ్డి నవీన్ వివిధ గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు బిఆర్ఎస్ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు