మహిళా హాకీ జట్టులో మన తెలుగు తేజం

rajni_2463769gమన భారత మహిళా హాకీజట్టు.. అపూర్వ ఘనత సాధించింది. తొలిసారి మహిళల ఆసియా ఛాంపియన్‌ప్‌ పోటీల్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. శుక్రవారం సింగపూర్‌లో చైనాతో జరిగిన హోరాహోరీలో.. విజయ పతాక ఎగరేసింది.  ఆటలో జట్టు గోల్‌కీపర్‌గా చైనాకే ఓ పెద్ద అడ్డుగోడలా నిలిచింది మన తెలుగమ్మాయి ఎతిమరపు రజనీ. చిత్తూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరు నుంచి అంతర్జాతీయ క్రీడావనిలో అడుగు పెట్టిందామె.