మహ్మద్ నగర్ లో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు


జుక్కల్, మార్చి 30,( జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని మహ్మద్ నగర్ లో శ్రీ రామ నవమి ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు.బాజా భజంత్రీ తో భక్తులు వెంట రాగా కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ధఫేదార్ శోభ రాజు దంపతుల అధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గైనివిఠల్, సింగల్ విండో చైర్మన్లు నర్సింహారెడ్డి, వాజిద్ అలీ, సర్పంచులు సంగమేశ్వర గౌడ్,దపేదర్ బాలమణి , గ్రామస్తులు,భక్తులు పాల్గొన్నారు.