మాజీ మంత్రి వర్యులు బోడ జనార్దన్ ఈ రోజు చెన్నూర్ మండలంలోని పొక్కూర్

సుందరసాల గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్ట పోయిన వరద బాధితులకు సుమారు 200 ల మందికి దుప్పట్ల పంపిణీ చేశారు. అలాగే వెంకంపేట గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నష్టపోయిన ప్రతి కుటుంబానికి 10 వేల నష్ట పరిహారం తో పాటు, డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి ఇవ్వాలని అన్నారు. అలాగే వరదలతో పంటలు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం రాజా గౌడ్, గజ్జెల అంకాగౌడ్, దుర్గం సడువలి, రొడ్డ బాపు, జిల్లా వెంకటస్వామి, శేఖర్ రెడ్డి, దుర్గం బొందయ్య, రొడ్డ సది, మహేష్, జోగురు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.