మాజీ మంత్రి శంకర్రావుకు బెయిల్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: గ్రీన్‌ఫీల్డ్‌ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి శంకర్రావుకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఈకేసులో ఆయనకు ముందుస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో గతంలో శంకర్రావును పోలీసులు అరెస్టు చేయడం ఆయన ఆస్పత్రి పాలుకావడంతో వివాదంగా మారిన తెలిసిందే.