మాడల్ స్కూల్ విద్యార్థుల సమస్యలు పట్టని మంత్రి,
– అగ్రవర్ణ కులానికి చెందిన ప్రిన్సిపాల్ అయినందుకేనా తెలంగాణ రాష్ట్ర,జిల్లా విద్యాశాఖ అధికారుల అండదండలు.
– సిఎం సోంత జిల్లాలో ఇంత జరుగుతున్నా పట్టించుకోని జిల్లా పాలన అధికారులు.
– సిఐడి చేత న్యాయ విచారణ జరిపించి ప్రిన్సిపాల్ పై శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోవాలి.
– మాడల్ స్కూల్ గేట్ ముందు ఎ.ఐ.ఎస్.ఎఫ్. ధర్నా
– సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేశ్ డిమాండ్..
హుస్నాబాద్( జనంసాక్షి ) 6 జులై
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వంత సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవిపై పాఠశాలలో జరిగిన కొన్ని అవినీతి ఆరోపణలు వివిధ సంఘటనలు బలంగా వున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రిన్సిపాల్ శ్రీదేవిని నిజామాబాద్ జిల్లా బాల్కోండకు బదీలి చేసిన విషయం విదితమే.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఇచ్చిన బదీలిలను ఆర్డర్ ను ప్రిన్సిపాల్ తీసుకోకుండా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకోని మల్లి హుస్నాబాద్ మాడల్ స్కూల్ లో విధులకు హాజరవుతు పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఫిర్యాదును దృష్టిలో పెట్టుకొని రోజు అవిద్యార్థిని పట్ల దురుసుగా ప్రవర్తిస్తు
నీమూలంగానే పాఠశాల పరువు బజారుకెక్కిందని ప్రతి రోజూ తరగతి గదుల్లో తిప్పుతు విద్యార్థిని అవహేళన చేసిన సంఘటన రోజూ
పాఠశాలలో వెలుగులోకి వస్తూనే ఉంది. ప్రిన్సిపాల్ శ్రీదేవి తీరుమారలని బుధవారం నాఊ
మాడల్ స్కూల్ గేటు ముందు ఎఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో నిరసనగా ధర్నా నిర్వహించారు.
ఈసందర్బంగా హాజరైన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ మాట్లాడుతూ
ప్రిన్సిపాల్ శ్రీదేవి ఉద్దేశ పూర్వకంగానే విద్యార్థులను తరుచుగా చితక బాదడం, మధ్యాహ్న భోజన వసతులపై పర్యవేక్షణ చేయకుండా పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారో లేదో పర్యవేక్షణ విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని విద్యార్థిని విద్యార్థులు వాపోతున్నారని గడిపె మల్లేశ్ అన్నారు. పాఠశాలలో పనిచేస్తున్న
తోటి మహిళా ఉపాధ్యాయురాలుపై పాఠశాలలో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తు అసభ్య పదజాలంతో అనుచితంగా అసభ్య కరంగా ప్రవర్తించినప్పటికి సదరు ఉపాధ్యాయుడిపై మందలింపు,
కనిస చర్యలు ప్రిన్సిపాల్ ఏమాత్రం చేపట్టకుండా ప్రిన్సిపాల్ పిన్న శ్రీదేవి జవాబుదారి తనంగా పని చేయడం లేదని బయట విమర్శలు గుప్పు మంటున్నాయి. హుస్నాబాద్ మాడల్ స్కూల్లో
ఇంత జరుగుతున్న జిల్లాకు చెందిన రాష్ట్ర వైద్య,ఆరోగ్య,
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు,
ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి,
హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితేల సతీష్ కుమార్ ప్రత్యేక చోరవ తీసుకుని మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవిపై సిట్టింగ్ జడ్జితో సమగ్రంగా న్యాయ విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని గడిపె మల్లేశ్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె సుజిత్ కుమార్, బిసి సబ్ ప్లాన్ సంఘం జిల్లా కార్యదర్శి ఎగ్గొజు సుదర్శన్ చారి,
చిట్టంపల్లి సురేష్ మాడల్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.