మాదకద్రవ్యలు సేవించి యువతి వీరంగం
హైదరాబాద్, జనంసాక్షి: బంజారాహిల్స్‌లో ముంబయికి చెందిన అయేషా అనే యువతి మాదకద్రవ్యాలు సేవించి వీరంగం సృష్టించింది. రోడ్డుపైన వెళుతున్న జనంపైకి రాళ్లు విసిరి నానా హంగామా చేసింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.