మానవత్వం చాటుకున్న ఎంపిపి తులశ్రీనివాస్
(జనంసాక్షి) ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నష్టపోయిన మారుమూల ఆదివాసి, గిరిజన గ్రామాలను సందర్శించి వారి కష్టాలని చూసి చలించి పోయిన బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ తనవంతుగా నక్కల వాడ గ్రామంలో 100 వంద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించి వారికి భరోసా కల్పించారు. అలాగే బోథ్ మండలం లో గత ఏడు రోజులుగా తీరిక లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పాట్నాపూర్ వద్ద గల కాండ్రే బ్రిడ్జి పూర్తిగా తెగిపోయి అటువైపు 15 గ్రామాల ప్రజలకు రాకపోకలు ఇబ్బందిగా మారి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నారన్న విషయం తెలుసుకొని వెంటనే ఆర్ అండ్ బి డీ ఈ తో మాట్లాడి తనవెంట ఆ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి దానిని పరిశీలించారు అనంతరం అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేసి, అటువైపు భారీ వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, వెంటనే బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని నిర్సంమణ సంస్స్థథయిన వారికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే అటువైపు వాహనాలు వెళ్లడం కుదరక పోవడంతో బైక్ పై వెళ్లి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని వారిలో ధైర్యాన్ని నింపారు. పాట్నాపూర్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు వారికి అంగన్వాడీ కేంద్రాన్ని, అలాగే కల్వర్టు మంజూరుకు హామీ ఇచ్చారు . ఇలా అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించే ఇలాంటి నాయకులు ఉండటం అదృష్టం అని ఇంత కష్ట కాలంలో మా దగ్గరికి వచ్చి మాకు అండగా ఉన్నందుకు అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎంపీపీ కి ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ, ఎంపీవో, ఏ పి ఓ, సర్పంచ్ సంఘము అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, PACS చైర్మన్ కదం ప్రశాంత్, ఆయా గ్రామాల ఎంపీటీసీ లు, సర్పంచ్ లు పాల్గొన్నారు.