మానవ తప్పిదాలకు జలచరాలు బలి

 

చనిపోయిన తిమింగలం కడుపులో ప్లాస్టిక్‌ వ్యర్థాలు

జకార్తా,నవంబర్‌21(జ‌నంసాక్షి): ప్లాస్టిక్‌ వ్యర్థ్యాలు జంతువులకు, జలచరాలకు ఎంతటి నష్టాన్ని కలిగిస్తున్నాయో ఈ ఘటన తెలియజేస్తోంది. ఇండోనేషియాలో ఓ భారీ తిమిగలం చనిపోయింది. అక్కడి వకటోబి నేషనల్‌ పార్కులో చనిపోయి ఉన్న తిమింగలాన్ని సిబ్బంది గుర్తించారు. దాన్ని పరిశీలించగా పొట్టలో దాదాపు 6కేజీల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉన్నాయి. ప్లాస్టిక్‌ కప్పులు, గ్లాసులు, చెప్పులు కూడా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. తిమింగలం పొట్ట నుంచి దాదాపు 115 ప్లాస్టిక్‌ గ్లాసులు, బ్యాగులు, దాదాపు వెయ్యి ముక్కలుగా ఉన్న తీగ బయటపడినట్లు వెల్లడించారు. వకటోబి నేషనల్‌ పార్కులో భాగమైన కపోటా ద్వీపం జలాల్లో 9.5విూటర్ల భారీ తిమింగలం చనిపోయి కనిపించినట్లు పార్కు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ పార్కు డైవింగ్‌కు బాగా ప్రసిద్ధి. తిమింగలం చనిపోవడానికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఈ ఏడాది జూన్‌లో థాయ్‌లాండ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పైలట్‌ రకం తిమింగలం మృతిచెందింది. దాని పొట్టలో కూడా పెద్ద మొత్తంలో ఎ/-లాస్టిక్‌ వ్యర్థాలు లభ్యమయ్యాయి.