మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో స్టడీ మెటీరియల్ పంపిణీ.

ఫోటో రైటప్: మానసిక దివ్యాంగులకు స్టడీ మెటీరియల్ అందజేస్తున్న వాసవి క్లబ్ సభ్యులు.
బెల్లంపల్లి, ఆగస్టు26, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం పద్మావతి మెడికల్ స్టోర్స్ యజమాని పెద్ది రాజేందర్ సహకారంతో మంచిర్యాల పట్టణంలోని మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలోని పిల్లలకు సంబంధించిన ఏడు సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల పిల్లలకు వారికి కావలసిన స్టడీ మెటీరియల్ తో పాటు వారికి తెలిసే విధంగా వారికి సంబంధించిన ఆట వస్తువులను పునరావాస కేంద్రానికి అందజేశారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం ఈ కార్యక్రమంలో చేపట్టినట్లు వాసవి క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో గవర్నర్ బాల సంతోష్, అంతర్జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు రేణికుంట్ల శ్రీనివాస్, జిల్లా రీజన్ చైర్మన్ మరియు మెటీరియల్ దాత పెద్ది రాజేందర్, వాసవి క్లబ్ బెల్లంపల్లి అధ్యక్షుడు శ్రీనివాస్, కోశాధికారి రాచర్ల సంతోష్ , పాఠశాల కరస్పాండెంట్ సదానందం, టీచర్లు పాల్గొన్నారు.