మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు.
వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.
తాండూరు ఆగస్టు 15(జనంసాక్షి)తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ మాత్మ గాంధీ చిత్రపటానికి పూజలు నిర్వహించి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి డైరెక్టర్లు ఆశన్న ,మల్లప్ప , కార్యాలయం సిబ్బంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.