*మార్కెట్ స్థలం కబ్జా*

– కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
– అక్రమ భవన నిర్మాణం పై చర్యలేవి…?
– పాలకమండలి పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటి…?
– అధికారులు పాలకమండలి అక్రమార్కులతో కుమ్మక్కయ్యారా…?
– రెవెన్యూ అధికారుల సాక్షిగా మార్కెట్ స్థలం కబ్జా
– కలెక్టర్ దృష్టి సాధించాలని విజ్ఞప్తి
*అధికారుల అండదండలతోనే అక్రమార్కులు పేట్రేగిపోతున్నారనే విమర్శలు, అధికారులు నామ మాత్రపు కూల్చివేతలతో భయపెడతారు ముడుపులు ముట్టాక దాటవేస్తారు అని ధ్వజం, ఎన్నో ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అధికారుల చర్యలు శూన్యం, ఏ ప్రభుత్వ భూమిని పరిరక్షించారో నిరూపిస్తారా అనే నిలదీతలు, పాలకమండలి సభ్యులకు ప్లాట్లను ఏరగా వేసారనే పుకార్లు రెవెన్యూ అధికారుల అక్రమాస్తులపై సోదాలు నిర్వహించాలని స్థానికుల డిమాండ్*
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) ఆగస్టు 20 :- ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు విధినిర్వహణలో ఉన్న రెవెన్యూ అధికారులు అనుసరిస్తున్న తీరు కంచే సేనును మేసిన చందంగా ఉందనే ఆరోపణలు స్థానికుల నుండి మెండుగా వినిపిస్తున్నాయి 582 , 583 , 585 , 586 , 587 సర్వే నెంబర్లకు చెందిన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు పాల్పడుతూ రేకుల రూముల నిర్మాణాలతో పాటు ఏకంగా భవన నిర్మాణమే చేపడుతున్నారని ఈ స్థలంలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను పూర్తిస్థాయిలో తొలగించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం చెలించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు అధికారికంగా మార్కెట్ కోసం కేటాయించిన ఈ స్థలంలో అక్రమ మార్గంలో నిర్మాణాలు చేపడుతుంటే తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూములను పరిరక్షించడమే లక్ష్యంగా విధులు నిర్వహించాల్సిన రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ చేతులు ముడుచుకొని చోద్యం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటీ…? అని నిలదీస్తున్నారు నేరుగా తహసిల్దార్ ఈ స్థలంలో వెలుస్తున్న నిర్మాణాలు అక్రమ నిర్మాణాలే వాటిని తొలగిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నప్పటికీ అక్రమ మార్గంలో గెలుస్తున్న ఈ భవన నిర్మాణం పనులు పూర్తి కావస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కై అధిక మొత్తంలో ముట్టజెప్పే ముడుపులకు ముచ్చటపడుతు ప్రభుత్వ భూములను పంచగదల పలహారం చేసేందుకు అధికారులే పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు అని అనుకోవచ్చా…? అని మండిపడుతున్నారు ఈ ప్రభుత్వ స్థలం మార్కెట్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలమని ఈ స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగం పై ఉందనే విషయం తెలిసి కూడా ఈ ప్రభుత్వ స్థలంలో వెలుస్తున్న రేకుల రూముల నిర్మాణాలతో పాటు భవన నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో తొలగించి నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కై థాయిలాల కోసం తపనబడుతు విధినిర్వహణలో బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని అనడానికి నిలువెత్తు నిదర్శనం అక్రమ నిర్మాణాలతో దర్శనమిస్తున్న ఈ ప్రభుత్వ స్థలం కాదా…? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెవెన్యూ అధికారుల ఆస్తులపై సోదాలు నిర్వహించి విచారించి ప్రభుత్వం ఇచ్చే జీతాలకన్నా అక్రమ సంపాదనకు ఆసక్తి చూపి విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో తేలిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ మార్కెట్ స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అటు రెవెన్యూ అధికారులతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళల కృషి చేస్తారని నమ్మకంతో ఎన్నుకోబడ్డ పాలకమండలి సభ్యులపై లేదా…? అనే నిలదీతల పర్వం మొదలైంది అటు రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు పాలకమండలి సభ్యులు కోట్ల విలువచేసే ఈ మార్కెట్ స్థలం కబ్జా వ్యవహారంపై జోక్యం చేసుకోకుండా మౌనవ్రతం పాటించడం బాధ్యత రహితంగా వ్యవహరించడం కాదా…? పాలకమండలి సభ్యులకు అక్రమార్కులు ప్లాట్లను ఏరగా వేశారు ఈ మార్కెట్ స్థలాన్ని కాపాడేందుకు పాలకమండలి సభ్యుల నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవు అనే పుకార్లు వాస్తవాలేనా…? ఈ పుకార్లు వాస్తవాలు కానీ ఎడల పాలకమండలి సభ్యులు మార్కెట్ స్థలాన్ని పరిరక్షించే విషయంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత వారిపై ఉందనే విషయాన్ని మరిచి పెదవి విప్పకుండా మౌనంగా ఉండడంలో ఆంతర్యం ఏమిటీ…? అటు రెవెన్యూ అధికారులు ఇటు మునిసిపల్ అధికారులు పాలక మండలి సభ్యులు మార్కెట్ కోసం కేటాయించిన ఈ ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించే విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న తీరుపట్ల జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఈ స్థలాన్ని పరిరక్షించి బాధ్యతారైతంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు