మార్పు లేని వాజ్‌పేయ్‌ ఆరోగ్యం

ఇంకా విషమంగానే ఉందన్న ఎయిమ్స్‌

ఆందోళనకరంగానే ఉందన్న రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఢిల్లీలో ఎయిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రధాని మోడీ ఇప్పటికే రెండుసార్లె ఎయిమ్స్‌కు వచ్చి అటల్‌ ఆరోగ్యంపై ఆరా తీసారు. కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బిజెపి అగ్రనేతలు, కేందరమంత్రులు ఎయిమ్స్‌కు తరలి వస్తున్నారు. దీంతో ఎయిమ్స్‌ వద్ద అంతా టెన్షన్‌గా ఉంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. మరోవైపు ఇప్పటికీ ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు ఎయిమ్స్‌ వైద్యబృందం పేర్కొంది. ఈ మేరకుఉదయం ఎయిమ్స్‌ వైద్యులు హెల్త్‌బులిటిన్‌ విడుదల చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేదు. ఇప్పటికీ విషమంగానే ఉంది. లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌తో చికిత్స అందిస్తున్నాం…అని ఎయిమ్స్‌ విూడియా ప్రోటోకాల్‌ విభాగం చైర్మన్‌ డాక్టర్‌ ఆర్తి విజ్‌ వెల్లడించారు. మాజీ ప్రధాని ఆరోగ్యం అంతకంతకు క్లిష్టంగా మారుతుండడంతో… ఆయనను పరామర్శించేందుకు జాతీయ నేతలంతా ఎయిమ్స్‌కు తరలి వెళుతున్నారు. బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే

అడ్వాణీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు వాజ్‌పేయిని పరామర్శించగా… యోగి ఆదిత్యనాథ్‌, కేజీవ్రాల్‌, మమతా బెనర్జీ సహా పలువురు ముఖ్యమంత్రులు తమ అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఎయిమ్స్‌కు తరలి వచ్చారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజపేయి ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. మధ్యాహ్నం ఎయిమ్స్‌ చేరుకున్న రాజ్‌నాథ్‌.. వాజపేయి ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎయిమ్స్‌ నుంచి వెళ్లిపోయారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ.. ఇవాళ మధ్యాహ్నం ఆయన కూడా ఢిల్లీకి పయనమయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు.