మావోయిస్టు సానుభూతిపరుడు అరెస్టు
వరంగల్: ప్రజాప్రతిఘటన సానుభూతి పరుడుని వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి రూ.9లక్షల నగదు, సెల్‌ఫోన్, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు సానుభూతి పరుడైన దామోదర్ పలువురిని బెదిరించి చందాలు వసూలు చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.