మిజోరం ఎన్నికల అధికారిపై వ్యతిరేకత

 

కేంద్ర బలగాలపై రాద్దాంతం

ఐజ్వాల్‌ ,నవంబర్‌12(జ‌నంసాక్షి): మిజోరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌బీ శశాంక్‌కు వ్యతిరేకంగా పలు సంఘాలు, రాజకీయ నాయకుల నుంచి నిరసన సెగ తగులుతున్నది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలను భారీగా మోహరించాలని ఆయన చేసిన ఓ కీలక ప్రతిపాదన పట్ల కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయనకు ఆ రాష్ట్ర పోలీసుల నుంచి మద్దతు లభించింది. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరపడానికి తమకు 40 కంపెనీలకు చెందిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్‌) కావాలని శశాంక్‌ ప్రతిపాదన చేయగా అది సరైందేనని ఆ రాష్ట్ర పోలీసులు అన్నారు. సుమారు 11 లక్షల జనాభా మాత్రమే ఉన్న మిజోరంలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి. ఆ రాష్ట్ర డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ జోసెఫ్‌ లాల్‌చ్చుయానా విూడియాతో మాట్లాడుతూ… ‘రాష్ట్రంలోని సంబంధిత అధికారులందరి అభిప్రాయాలు తీసుకున్నాకే 40 కంపెనీలకు చెందిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని

ఎన్నికల ప్రధానాధికారి ప్రతిపాదించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి మేము భారత ఎన్నికల కమిషన్‌ సూచనల ప్రకారం పనిచేస్తాము. ఈ సారి ఈవీఎం, వీవీపాట్‌ మిషన్ల కోసం రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో భారీ భద్రతతో స్టాం/-రగ్‌ రూమ్‌లు కావాలి. అలాగే, ఈసీఐ సూచనల ప్రకారం ప్రతి గది వద్ద సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఉండాలి. అంతేగాక, ఓట్ల లెక్కింపు సమయంలో ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రత్యేక హాలు ఉండాలి. మళ్లీ వీటికి కూడా కట్టుదిట్టమైన భద్రత అవసరం. 40 కంపెనీలకు చెందిన బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, సీఆర్‌పీఎఫ్‌, అసోం పోలీసులను కేంద్ర ¬ం శాఖ ఇప్పటికే పంపింది’ అని వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్రంలో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 28 కంపెనీలకు చెందిన సిబ్బందిని మాత్రమే మోహరించారు. అప్పట్లో 8 స్ట్రాంగ్‌ రూమ్‌లను మాత్రమే ఏర్పాటు చేశారు.

సీఈవో పదవిలో ఉన్న ఎస్‌బీ శశాంక్‌పై ఇటీవల ఆ రాష్ట్రం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎన్నికల పక్రియలో కల్పించుకుంటున్నారని రాష్ట్ర ¬ంశాఖ కార్యదర్శి లాల్నున్‌మవయా చువాంగోపై ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా… చువాంగోపై వేటు పడింది. అయితే, ఆ రాష్టాన్రికి చెందిన చువాంగో.. ‘బ్రూ’ వలసదారుల ఓటుహక్కుకు అడ్డుపడుతున్నారని, ఆయనను తొలగించాలని శశాంక్‌ చేసిన ఫిర్యాదు మేరకే ఈసీ చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ కారణంగా పౌర సంఘాలు, విద్యార్థి సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తూ.. శశాంక్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశాయి. ఆ రాష్ట్రంలోని పార్టీలు కూడా ఇదే డిమాండ్‌ చేస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన రాష్ట్రంలో భారీ భద్రత ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేయడంతో వారి నుంచి మరోసారి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయనను ‘మిజోల వ్యతిరేక అధికారి’ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేసిన ప్రతిపాదనను ‘తెలివితక్కువ చర్య’గా అక్కడి రాజకీయ పార్టీలు కూడా పేర్కొంటున్నాయి. దశాబ్దాలుగా తమ రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని, దాన్ని నాశనం చేసేలా ఉన్నారని ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు, ఆయనపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో మరొకరిని నియమించాలని ఈసీ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టింది.