మిడ్ మానేరు వాసులను గత రాత్రి నుంచి అక్రమంగా అరెస్టు చేశారు
బోయిన్‌పల్లి సెప్టెంబర్ 16 (జనం) రాజన్న సిరిసిల్ల జిల్లా లో మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో మిడ్ మానేరు భూ నిర్వాసితులను గత రాత్రి నుంచి అక్రమంగా అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మేడిపల్లి సత్యం బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఖండించారు. ప్రతి కుటుంబానికి 5 లక్షల 4 వేల రూపాయలు ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీని 8 ఏళ్లుగా నెరవేర్చకపోవడం శోచనీయమన్నారు.
ప్రాజెక్టుల కోసం భూములిచ్చి సర్వం కోల్పోయి నిర్వాసితులపై కనీస మానవత్వం చూపకపోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ముఖ్యమంత్రికైనా ప్రతి కుటుంబానికి 5 లక్షల 4 వేల రూపాయలు, 18 ఏళ్ల యువతకు పట్టా ప్యాకేజీని అందించారు, పెండింగ్‌లో ఉన్న నిర్వాసితుల సమస్యలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం: బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భీంరెడ్డి మహేశ్వర్ రెడ్డి, చొప్పదండి మండల అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, వన్నారం ఎంపీటీసీ జవ్వాజి హరీశ్, మండల ఉపాధ్యక్షుడు బోయిని ఎల్లేష్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు అనుముల. హరికృష్ణ, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగుల వంశీగౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు నిమ్మ వినోద్ రెడ్డి, శాలివాహన శ్రీనివాస్, ఆకుల అజయ్ ఉన్నారు.