మిస్త్రీ కి టాటా..!!

టాటా సన్స్‌ గ్రూపు కంపెనీల నుంచి సైరస్‌ మిస్త్రీని పూర్తిగా పంపించేసేందుకు తొలి ఘట్టం ముగిసింది. ఇప్పటికే టీసీఎస్‌ ఛైర్మన్‌ పదవిని కోల్పోయిన ఆయన.. ఇప్పుడు ఆ కంపెనీ డైరెక్టరు బాధ్యతలకు కూడా దూరమయ్యారు. టీసీఎస్‌ సహా ఏడు కంపెనీల బోర్డు డైరెక్టరు పదవుల నుంచి మిస్త్రీని తొలcyrus-mistry-650_650x400_51477465366గించేందుకు ఈ నెలలో వరుస అసాధారణ సర్వసభ్య సమావేశాలను (ఈజీఎం) టాటా సన్స్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో మొదటి ఈజీఎం మంగళవారం జరిగింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ సమావేశంలో మిస్త్రీ తొలగింపు ప్రతిపాదనకు 93.11% మంది వాటాదార్లు అనుకూలంగా ఓటేశారు. కేవలం 6.89% మంది మిస్త్రీకి మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మిస్త్రీని తక్షణం బోర్డు డైరెక్టరు పదవి నుంచి తొలగిస్తున్నట్లు టీసీఎస్‌ వెల్లడించింది.  ‘మిస్త్రీని నియమించిన ప్రమోటరు గ్రూపు (టాటా సన్స్‌, టాటా ట్రస్ట్స్‌) నమ్మకాన్ని ఆయన కోల్పోయారు. టీసీఎస్‌ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీని ఆయన విడిచిపెట్టాల’ని సమావేశంలో మెహతా అన్నారు. పనితీరు కంటే విశ్వసనీయతను కోల్పోవడమే ఇక్కడ కీలక అంశమని ఆయన తెలిపారు. ‘టీసీఎస్‌ స్వతంత్ర డైరెక్టర్లు ఈ మొత్తం అంశంపై సమీక్ష జరిపారు. ప్రస్తుత పరిణామం కంపెనీ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అందరూ నమ్ముతున్నార’ని చెప్పారు.