ముంపుకు గురైన గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్.
జనంసాక్షి న్యూస్ నెరడిగొండ:
ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు మండలంలోని కడం వాగు పరివాహక ప్రాంతాల్లో వాగు వరదలకు పంటపొలాలు నీటమునిగి రోడ్లు వంతెనలు కోతకు గురై రాకపోకలు నిలిచిపోయి అంతరాయం ఏర్పడ్డాయి.ముంపుకు గురైన కుఫ్టీ కుమారి వెంకటాపూర్ వాగ్దారి మాదాపూర్ సావుర్గాం గ్రామాల్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం రోజున విస్తృతంగా పర్యటించి తెగిపోయిన రోడ్లు వంతెన పంటపొలాలను పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను సంబందిత అధికారులను స్థానిక నాయకులతో అడిగి తెలుసుకున్నారు.నీటమునిగిన పంటలకు నష్టం వాటిల్లిందని, దీనిపై నివేదికను ప్రభుత్వానికి పంపించి రైతులకు న్యాయం జరిగేవిదంగా కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తోపాటు అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్,ఆర్డీవో రమేష్ రాథోడ్ డిపిఆర్ఓ భీమ్ కుమార్ మండల ఎంపీపీ రాథోడ్ సజన్ మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల బోజన్న పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్ రైతు సమన్వయ కర్త కవి గడ్డం భీంరెడీ శివారెడ్డి మండల అధికారులు తహశీల్దార్ పవన్ చంద్ర ఎంపీడీఓ అబ్దుల్ సమద్ ఆర్ఐ నాగోరావు వివిధ శాఖ అధికారులు గ్రామ పంచాయతీ సర్పంచ్లు నాయకులు
తదితరులు పాల్గొన్నారు.

Attachments area