ముంపు గ్రామాలను సందర్శించిన ఎమ్మెల్యే.

అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్
జనం సాక్షి .
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగడంతో  గోదావరి పరివాహక ప్రాంతాలైన జన్నారంలోని రోటిగుడా ,తపాలాపూర్, తిమ్మాపూర్ రాంపూర్, బాదంపెల్లి కలమాడుగు గ్రామాలను ఎమ్మెల్యే అజ్మీర్ రేఖ శ్యామ్ నాయక్ గారు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఎమ్మెల్యే గారు గ్రామాల్లో పర్యటించి తీవ్రం నష్టం జరిగిన పేదలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కడెం ప్రాజెక్టుకు పెను ప్రమాదం తప్పి మనందరం బయటపడ్డామని ఆ భగవంతునికి ఈ సందర్భంగా మనం కృతజ్ఞతలు తెలిపాల్సిన సమయం ఇది అని అన్నారు. అలాగే ప్రభుత్వ అధికారులు స్థానిక నాయకులు చాకచక్యంతో ముంపు గ్రామాల నుండి ప్రజలను సురక్షితగా ప్రాంతాలకు తరలించి ప్రాణ నష్టం వాటిల్లకుండా చేశారని వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నట్టు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.