ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సిపిఐ
పినపాక నియోజకవర్గం జులై 13 ( జనం సాక్షి):వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో మణుగూరు మండలంలోని పలు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బుధవారం సీపీఐ బృందం , కమలాపురం, కొండాయిగూడెం లో నీట మునిగిన పంట పొలలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటితో రాయిగూడెం చెరువు దారి మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. అటు వెళ్లాలంటే గోదావరి నది వరకు ఉన్న కాలువ దాటి. వెళ్లాలి. అలా వెళ్లి గ్రామస్థులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముప్పు గ్రామాలు తిరిగే క్రమంలో మణుగూరు తహసిల్దార్ కె. నాగరాజు, సి ఐ ముత్యం రమేష్,,ఎం పి డి ఓ వీరబాబు, ,మున్సిపాలిటీ అధికారులు, ఇరిగషన్ ఏ ఈ, బిల్ కలెక్టర్, డాక్టర్. శిరీష, ఏ ఈ రామారావు లు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు.. వారితో సీపీఐ నాయకులు పరిస్థితులపై ముచ్చటించారు. నిరంతరం కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి పెరిగే అవకాశం ఉన్నందున ముంపు గ్రామాలలో ఉన్న ప్రజలను పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు మండల కార్యదర్శి జంగం మోహనరావు,పట్టణ కార్యదర్శి దూర్గ్యల సుధాకర్,ఏఐటీయూసీ మండల కార్యదర్శి అక్కినర్సింహారావు, ,మాజీ మండల కార్యదర్శి ఎస్ కే సర్వర్,గిరిజన సం