ముక్తార్ పాష రెండవ వర్ధంతి సభను జయప్రదం చేయండి
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 22(జనం సాక్షి)
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ముక్తార్ పాష రెండవ వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు వరంగల్ నగరంలోని నెక్కొండ క్రాస్ గవి చర్ల జంక్షన్లో ఆ పార్టీ నాయకులు పోస్టర్ , ఆవిష్కరించారు
ఈనెల 24వ తేదీన బయ్యారం గాంధీ సెంటర్ క్రీడా మైదానంలో సభ జరుగుతుందని వారు తెలిపారు ముందుగా మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రదర్శన అనంతరం బహిరంగ సభ జరుగుతుందని వారు తెలిపారు
న్యూ డెమోక్రసీ ఖమ్మం వరంగల్ జిల్లాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది న్యూ డెమోక్రసీ మహబూబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అధ్యక్షతన జరిగే ఈ సభలో సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే గోవర్ధన్ ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ వి సంధ్య ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ ఏరియా నాయకులు మోకాళ్ళ మురళీకృష్ణ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీతారామయ్య తదితరులు ప్రసంగిస్తారని వారు తెలిపారు
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, వరంగల్ నగర కార్యదర్శి ఆరెల్లి కృష్ణ నాయకులు బండి కోటేశ్వరరావు రాచర్ల బాలరాజు ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు గంగుల దయాకర్ ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు హరిబాబు ఇనుముల కృష్ణ అయిత యాకయ్య తదితరులు పాల్గొన్నారు సభను జయప్రదం చేయాలని వివిధ వర్గాల ప్రజానీకం కు వారు పిలుపునిచ్చారు
Attachments area