ముఖ్యమంత్రి కెసిఆర్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పై విచక్షణారహితంగా మాట్లాడటం విడ్డూరం.
ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం.
జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్.
తాండూరు అగస్టు 17(జనంసాక్షి)రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పై విచక్షణా రహితంగా మాట్లాడటం విడ్డూరమని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహు శ్రీలత, ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ మాట్లాడుతూ భారీ బహిరంగసభలో జిల్లా కుగాను నాలుగు నియోజకవర్గ అబివృద్ది పై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడతా రేమో అని అనుకుంటే భారతీయ జనతాపార్టీ ప్రదాని
నరేంద్ర మోడీ పై విమర్శించేవిదంగా మాట్లడడం విడ్డురమన్నారు.మహిళలను కించపరిచే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం తగదన్నారు. మహిళల ఆత్మ గౌరవం కోసం కేంద్ర ప్రభుత్వం మరుగుదొడ్లు కట్టీంచిన గనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.శాంతి భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టిఆర్ఎస్ పార్టి 8 సంవత్సరాల పాలనలో ఓరిగేదేమి లెదన్నారు.టిఆర్ఎస్ పార్టీ కి దిటైన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు.రాబోయే ఎన్నికల్లో తగిన ముల్యం తప్పదన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేరకపోవడంతో సమస్యలపై అడిగితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను అడ్డుకోబోతే పోలీసులు తీవ్రంగా గాయపరిచారని మండిపడ్డారు.
రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జండా ఎగురవేస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ అన్ని జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ జండాఎగురవేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే హక్కు లేదా అని ప్రశ్నించారు. పేద ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని తెలిపారు. గత ఎన్నికల సమయంలో తాండూర్ పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కళాశాల ఇస్తామని మాట తప్పారని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాండూర్ సమస్యలపై అడగడానికి వెళితే పోలీసులు అరెస్టు చేసి తీవ్రంగా గాయపరిచారని వెల్లడించారు.ముడు రోజుల ముందు గానే కేసీఆర్ సభను అడ్డుకుటామని పత్రిక ప్రకణచెయడం జరిగిందని.
సోయిలేని…ముఖ్యమంత్రి… సోయిలేని ఎమ్మెల్యేలు అంటు విమర్శించారు.
రాష్ట్రంలో కుటుంబ పాలన కోనసాగు తుందన్నారు.తట్టేపల్ల మండలం ప్రకటనపై కేసీఆర్ మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు.
దేశప్రధానిపై విచ్చక్షణరైతంగం మాట్లాడం సిగ్గు చేటన్నారు.ప్రజల మద్దత్తు భారతీయ జనతా పార్టీవైపు ఉందని తాండూరు అబివృద్ది దేయంగా కార్యక్రమాలు చెపడతామన్నారు. రాబోయే ఎన్నికల్లో తాండూరు గడ్డ పై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో
నాయకులు పూజారి పాండు ,బంటారం భద్రేశ్వర్ ,మండలనాయకులు సందీప్,
జిల్లా ఓబీసీ మోర్చ ప్రధాన కార్యదర్శి మిట్టి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.