ముఖ్యమంత్రి కెసిఆర్ సభను అడ్డుకుంటాం.

జిల్లా ప్తదానకార్యదర్శి యు.రమేష్ కుమార్.
తాండూరు అగస్టు 14(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా కేంద్రంలో 16న నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ సభను అడ్డుకుంటామని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా యు.రమేష్ కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తాండూర్ పర్యటనలో భాగంగా ఏర్పాటుచేసిన సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తాండూరు పట్టణానికి మెడికల్ కళాశాల మంజూరు చేస్తానని ప్రకటించారని గుర్తు చేశారు.కేసీఆర్ఇచ్చిన మాట నిలబెట్టుకోక ఇక్కడికి రావాల్సిన కళాశాల దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. అభివృద్ధిపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు.