ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే అభివృద్ధి సాద్యం.
టిఆర్ఎస్ ప్రచార కార్యదర్శి విద్యాసాగర్ గౌడ్.
తాండూరు. ఆగస్టు 17(జనంసాక్షి)
ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే బడుబలహిన వర్గాల సంక్షేమం అభివృద్ధి సాధ్యమని టిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి విద్యాసాగర్ గౌడ్ వేల్లడించారు.16న వికారాబాద్ జిల్లా కేంద్రంలో తలపెట్టిన బహిరంగ సభ విజయవంతం అవడం పట్ల టిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి విద్యాసాగర్ గౌడ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో రాష్ట్రంలోని పట్టణాలు గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా మంత్రి సబితా రెడ్డి సహకారంతో యువ నాయకుడు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలోనే పేదల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో పరిపాలన సౌలభ్యం కోసం నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభించడం అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం అదేవిధంగా పార్టీ పట్టిష్టతకై జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. రాష్ట్రంలో రాబోయే మరో 20 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం ఖాయమని దీమ వ్యక్తం చేశారు. వికారాబాద్ బహిరంగ సభలొ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సుకై పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆరు నూరైనా ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు నీరు అందిస్తానని హామీ ఇవ్వడం శుభ పరిణామం అన్నారు.ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో చెప్పడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.