ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం
పెద్ద కొడపగల్ ఎంపిపి ప్రతాప్ రెడ్డి
జుక్కల్ ,సెప్టెంబర్12జనంసాక్షి,
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం అని పెద్ద కొడపగల్ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం కామారెడ్డి జిల్లాలోని పెద్ద కొడప్ గల్ మండల పరిషత్ కార్యాలయంలో చిన్న తక్కడ్ పల్లి గ్రామానికి చెందిన లబ్దిదారుడు బుడ్డ సాయిగొండ కు
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా ఎంపిపి మాట్లాడుతు రోగాల బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొంది అప్పుల పాలైన పేదలకు సీఎం ఆర్ఎఫ్ ఉపశమనం లాంటిదని అన్నారు. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మెరుగైన వైద్యం అందేవిదంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు.
ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు.గర్భిణీలు, బాలింతలు,మాతాశిశు సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధచూపుతుందని తెలిపారు. ఆరోగ్య ఉపకేంద్రాల ద్వారా ఏఎన్ ఎంలు,ఆశావర్కర్ లు గర్భిణి, బాలింతల ఇండ్లకు వెళ్లి సలహాలు మందులు అందజేస్తున్నారని తెలిపారు.వందశాతం గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నే సహజ ప్రసవమయ్యేవిదంగా డాక్టర్లు ,ఆసుపత్రి సిబ్బంది, ఆశావర్కర్లు ,ఏఎన్ఎంలు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.ఆసుపత్రుల్లో ప్రసవమయిన వారికీ మగపిల్లాడు పుడితే 12వేలు,ఆడపిల్ల పుడితే 13వేలు రూపాయలు ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. ఈ విదంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులు, ఆకస్మికంగా గుండె నొప్పి ఇతర రోగాలబారిన పడినవారికి 108 అంబులెన్స్ లద్వారా సకాలంలో ఆసుపత్రుల్లో చేర్చే విదంగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని ఎంపిపి తెలిపారు.గతంలో నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అనేవిదంగా పరిస్థితి ఉండేదని నేడు కేసీఆర్ పాలనలో సర్కారు దవాఖానాల పరిస్థితి మెరుగైందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు అశోక్ పటేల్,నర్సు పటేల్ ,ప్రశాంత్ పటేల్ ,సుబాష్,బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.