ముగిసిన ప్రజాపద్దుల సంఘం సమావేశం
హైదరాబాద్: ప్రజాపద్దుల సంఘం సమావేశం ముగిసింది. వ్యక్తిగత ఖాతాల వ్యవహారంపై సంఘం ఈరోజు సమీక్షించింది. 11,328 కోట్ల రూపాయలకు లెక్కలు లేకపోవడాన్ని ప్రజాపద్దుల సంఘం తప్పు బట్టింది. 10 రోజుల్లో సమగ్ర వివరణ ఇవ్వాలని అధికారులకు ప్రజాపద్దుల సంఘం ఆదేశాలు జారీ చేసింది.