ముగిసిన మంత్రివర్గ సమావేశం ఇందికా అవాన్‌ యోజన యూనిట్‌ వ్యయం పెంపు

న్యూఢిల్లీ : ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఆర్థిక మంత్రి చిదంబరం విలేకరులకు వివరించారు. ఇందిరా ఆవాన్‌ యోజనలో యూనిట్‌ వ్యయం రూ. 45 వేల నుంచి 70 వేలకు పెంచారు. ఆవాన్‌ యోజన లబ్దిదారులు అవసరమైతే బ్యాంకులనుంచి 20 వేల రుణం తీసుకోవచ్చు, ఇంజీనిర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఐఎల్‌)లో 10 శాతం వాటాలు విక్రయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 12,200 కోట్ల పెట్టుబడి పునరుద్దరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్కూటర్స్‌ ఇండియా సంస్థను పునరుద్దరణ ప్రణాళికను కేంద్రప్రభుత్వం పక్కనపెట్టింది. సెక్యూరిటీన్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ప్రిసైడింగ్‌ అధికారి నియామకాలో హైకోర్టు జడిలకు అవకాశం ఇవ్వనున్నారు.