ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి పొందిన సంధ్యారాణి
ఝరాసంగం,ఆగస్టు20 (జనంసాక్షి)75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మండల అధికారుల అధ్వర్యంలో తహసిల్దార్ ఎంపి డి ఓ కార్యాలయల అవరణ లో రంగోలి ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో మండలంలోని మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా ఐ కే పి , మహిళలు పోటీలలో పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీలలో ఐ కే పి నుండి సంధ్యారాణి ప్రథమ బహుమతి అందుకున్నారు. మహిళ సంఘాల నుండి ఒకరు, మహిళల నుండి ఒకరు విజేతలుగా గెలిచారు. ముగ్గుల పోటీలో గెలిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు జరిగినది.ఈ కార్యక్రమంలో ఎంపిడి ఓ సుజాత మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వారోత్సవాల్లో సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.