మునుగోడు ఆత్మగౌరవ బారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలివెళ్ళిన హయత్ నగర్ బిజెపి శ్రేణులు — కార్పొరేటర్ నవ జీవన్ రెడ్డి
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) హయత్ నగర్ డివిజన్ నుండి కార్పొరేటర్ నవ జీవన్ రెడ్డి ఆద్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ షా ఆత్మగౌరవ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అదే విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి పార్టీలో చేరుతున్న శుభసందర్భంలో వారికి మద్దతుగా పెద్ద సంఖ్యలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డివిజన్ కార్యాలయం నుండి తరలివెళ్ళారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నవ జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుండి సీఎం కేసీఆర్ చెప్పే గారడీ మాటలు, మభ్యపెట్టె తప్పుడు హామీలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులో లేరన్నారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట లోనే అభివృద్ధి జరుగుతుందని మిగతా నియోజకవర్గాలు కళ్లకు కనబడట్లేదా మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించారని మండిపడ్డారు. కోటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎన్ని రకాలుగా జిమిక్కులు చేసిన హుజూరాబాద్ పరిస్థితే మునుగోడులో రిపీట్ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
