*మునుగోడు బహిరంగ సభకు తరలిన బిజెపి శ్రేణులు.

చిట్యాల21( జనంసాక్షి) నల్గొండ జిల్లా లోని మునుగొడు నియోజక వర్గానికి  విచ్చేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా  బహిరంగ సభకు  మండలం నుండి బిజెపి కార్యకర్తలు ఆదివారం తరలి వెళ్లారు. ఈ మేరకు బీజేపీ మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ జెండా ఊపి బయలుదేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో అవినీతి  తెరాస ప్రభుత్వాన్ని ఎండగడుదామని, ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన ప్రజలు సిద్ధంగా ఉన్నారని,  హుజూరాబాద్ నియోజక వర్గంలో జరిగిందే, ఇక్కడ భూపాలపల్లి నియోజక వర్గంలో కూడా కాషాయ జెండా ఎగర వేయడం ఖాయమని  అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి మోర్తల రాజేందర్, బిజెపి ప్రధానకార్యదర్శి మాచర్ల రఘు , శ్రిపెల్లి అనిల్, జిల్లా మండల నాయకులు మైదం శ్రీకాంత్, కశిరెడ్డి తిరుపతిరెడ్డి , రాయిని శ్రీనివాస్,  గాజనాల రవీందర్, గాజర్ల మల్లేష్, రావుల రాకేష్, శ్రీనివాస రెడ్డి,  రాజు, రఘుపతి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.