: మునుగోడు సభకు బయలుదేరిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు.
కౌడిపల్లి (జనంసాక్షి). మండల కేంద్రం నుంచి మునుగోడులో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు కౌడిపల్లి మండలం నుండి బిజెపి శ్రేణులు తరలి వెళ్లడం జరిగిందని బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గ బిజెపి పార్టీ అధిష్టానం పిలుపుమేరకు కౌడిపల్లి మండలం నుండి అధిక సంఖ్యలో మునుగోడు సభకు బయలుదేరడం జరుగుతుందని, మునుగోడులో భారతీయ జనతా పార్టీ అధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.
