మురుగు నీరు తొలగించేందుకు చర్యలు
– జనంసాక్షి వార్తకు స్పందించిన కౌన్సిలర్ తొంటి శ్రీను
జూలై19(జనంసాక్షి): ఖానాపూర్ మున్సిపాలిటీలోని “మురుగు పారదోలేదేలా?” అని శీర్షికన ఈనెల 19న సోమవారం ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది. మంగళవారం పట్టణంలోని 10వ వార్డులో కౌన్సిలర్ తోంటి శ్రీను కాలనీలో నీటి నిల్వ ఉన్న ప్రదేశాల్లో తిరిగి తాత్కాలికంగా నీరును పారదోలెందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు .కాలనీలో సమస్యలుంటే నేరుగా తన సెల్ నెంబర్ 9573936777 కు కాల్ చేసి చెప్పాలని సూచించారు.