మురుగు పారదోలేదేలా?

సక్రమంగా లేని డ్రైనేజ్ వ్యవస్థ
-ఇళ్ల మధ్యలోనే పారుతున్న మురుగు నీరు
జూలై 18(జనం సాక్షి): ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య సమస్య వేధిస్తోంది. పట్టణంలోని పలు కాలనీలో పారిశుద్ధ్య సమస్య జటిలంగా మారడంతో మురుగునీరు ఖాళీ స్థలాల్లో నిలచి దోమలకు అవసాలుగా మారుతున్నాయి . ఈ మురుగు నీరు నిల్వ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . కొన్ని కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఇళ్లలో నుంచి వెళ్లే మురుగునీరు అంతా రోడ్లపై లేదా ఖాళీ స్థలాల్లో పారుతుంది, దీంతో దుర్గంధం వెదజల్లడంతోపాటు అటు వైపు పోలేకపోతున్నమని వాపోతున్నారు. పట్టణంలోని పలు కాలనీలో అంతర్గత రహదారులపై మురుగునీరు పారడంతో వాహనదారులు , పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు మున్సిపల్ సిబ్బంది చెత్త సేకరణ వాహనాల ద్వారా చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నప్పటికీ కొందరు అవకాశాన్ని వినియోగించుకొలేక పోతున్నారు .ఓవైపు అధికారులు ప్లాస్టిక్ కవర్లను వాడొద్దంటూ అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్లాస్టిక్ కవర్లు దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు పట్టణంలో పలు కాలనీలో పందులు యదేచ్చగా సంచరిస్తుండడంతో రోగాల బారిన పడుతున్నామని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుత వర్షాకాల సీజన్లో పట్టణంలో పలు కాలనీల్లో  పేరుకుపోయిన మురుగునీరు వల్ల దోమల బెడద అధికమై ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం వుంది. దీనికి తోడు జనావాస ప్రాంతాల్లో పందులు సంచరిస్తూ మరింత కలుషితం చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా శాంతి నగర్, సుభాష్ నగర్,విద్యానగర్,శివాజీ నగర్ కాలనీలలో ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో డెంగ్యూ జ్వరం బారిన పడి ఆర్థికంగా, అరోగ్య పరంగా కుటుంబాలు చిన్న బిన్నం అయినా పరిస్థితి ఉంది. అధికారులు ఇప్పటికైనా పలుకాలనిలో డ్రైనేజ్ వ్యవస్థని ఏర్పాటు చేయడంతో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.